Lokesh Kanagaraj | తమిళ సినీ పరిశ్రమలో తనదైన స్టైల్‌తో సినిమాలు తెరకెక్కిస్తున్న దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రూపొందించిన యాక్షన్ క్రైమ్ డ్రామా ‘DC’ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తొలిసారి లీడ్ యాక్టర్‌గా నటించడంతో సినిమా విడుదలకు ముందే భారీ ఆసక్తి ఏర్పడింది. ఆయనకు జోడీగా వామికా గబ్బి నటించింది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇకపై ఇంట్లోనే ఈ గ్రిటీ యాక్షన్ డ్రామాను చూసే అవకాశం లభించింది. ‘DC’ సినిమా నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్ (Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు.
సాధారణ ఓటీటీ స్ట్రీమింగ్కు భిన్నంగా ఈ సినిమాను 4K రిజల్యూషన్‌తో పాటు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. దీంతో థియేటర్లలో కనిపించిన డార్క్ విజువల్ టోన్, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను హోమ్ స్క్రీన్‌పై కూడా మెరుగైన క్వాలిటీలో ఎంజాయ్ చేసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తోంది. ‘DC’లో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనదైన గ్రిటీ మేకింగ్‌తో కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. క్రైమ్, యాక్షన్ అంశాలను డార్క్ టోన్‌లో ప్రెజెంట్ చేయడంతో పాటు.. పాత్రల చుట్టూ ఉండే టెన్షన్, ఎమోషన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.\ముఖ్యంగా సినిమా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేలా ఉండటంతో థియేట్రికల్ రన్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన థంపింగ్ బీజీఎం సినిమాకు మరింత ఇంపాక్ట్ తీసుకొచ్చినట్లు చెబుతున్నారు.సన్నివేశాల్లో టెన్షన్ పెరిగే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను ఎలివేట్ చేసేలా ఉండటంతో.. ఓటీటీలో 4K, Dolby Atmosలో సినిమా చూసే వారికి ఈ అనుభూతి మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. దర్శకుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్.. ‘DC’లో తొలిసారి లీడ్ యాక్టర్‌గా కనిపించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. కెమెరా ముందు ఆయన ఎలా పెర్ఫార్మ్ చేశారు? అరుణ్ మాథేశ్వరన్ రాసిన పాత్రకు ఎంతవరకు న్యాయం చేశారు? అనే ఆసక్తితో ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూశారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో మరింత విస్తృతమైన ప్రేక్షకులకు లోకేష్ నటనను చూసే అవకాశం లభించింది.