ఖమ్మం, సెప్టెంబర్ 04 : ఖమ్మంలోని గట్టాయి సెంటర్ ప్రాంతంలో గల సామ్స్ డ్యాన్స్ అకాడమీ అండ్ ఫిట్నెస్ స్టూడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నులపండుగగా జరిగాయి. పిల్లలు రాధా, శ్రీకృష్ణుడి వేషధారణలతో అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తమ ఆటపాటలు, నృత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు. పిల్లల తల్లిదండ్రులు సైతం ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు తమ నృత్యాలు, డ్యాన్స్‌లతో సామ్స్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణాన్ని కృష్ణమయం చేశారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ అకాడమీ హెడ్ చల్లా సందీప్, డ్యాన్స్ మాస్టర్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

సామ్స్ డ్యాన్స్ అకాడమీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

సామ్స్ డ్యాన్స్ అకాడమీలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
తల్లిదండ్రులతో పిల్లల క్యూట్ డ్యాన్స్ వీడియో