పారిస్: ఉక్రెయిన్పై (Ukraine) రష్యా ఏ క్షణమైనా దాడి చేయవచ్చు. వెంటనే ఉక్రెయిన్ నుంచి వచ్చేయండి అని ఫ్రాన్స్ (France) ప్రభుత్వం తమ పౌరులకు సూచించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వచ్చేయాలని ఉక్రెయిన్లోని తమ పౌరులను కోరింది. రెండు వేర్పాటువాద ప్రాంతాలను రష్యా స్వతంత్ర దేశాలుగా గుర్తించడం, దేశంలో ఉక్రెయిన్ అత్యవసర పరిస్థితి విధించడంతో ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భారీఎత్తున బలగాలను మోహరించింది. బెలారసర్, క్రిమియా, నల్లసముద్రం వెంబడి సుమారు లక్షా 50 వేల మందికిపైగా సైన్యాన్ని రష్యా సిద్ధంగా ఉంచిందని, ఉక్రెయిన్పై ఏ క్షణమైనా యుద్ధానికి దిగవచ్చని బ్రిటన్ ఆందోళన వ్యక్తంచేసింది.
కాగా, ఉక్రెయిన్లోని వేర్పాటువాద నాయకులు రష్యా సాయం కోరారు. ఉక్రెయిన్ మిలిటరీ దాడుల కారణంగా డాన్బాస్ ప్రాంతంలోని పౌరులు మరణిస్తున్నారని, చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని.. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని వేర్పాటువాదులు రష్యాను అభ్యర్థించారు.