చల్లారని ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో నిరసనలు ఇంకా సద్దుమణగడం లేదు. ఈ వారాంతంలో మళ్లీ నిరసనలకు ఆందోళనకారులు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారాంతంలో అల్లర్లు, దుకాణాల లూటీ చోటుచేసుకోవడంతో ఈసారి భద్రతను కట్టుదిట్టం చేసింది. పారిస్‌తోపాటు పలు నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతోపాటు, బహిరంగ సభలపై ఆంక్షలు విధించింది. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లేదా గ్యాస్ నింపిన సీసాలు, డబ్బాలు, బాణసంచా కలిగి ఉండటాన్ని నిషేధించింది.
- ఈ వారాంతంలో మళ్లీ నిరసనలు
- భద్రత కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం
- పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ
- బహిరంగ సమావేశాలపై నిషేధం
పారిస్: ఫ్రాన్స్‌లో నిరసనలు ఇంకా సద్దుమణగడం లేదు. ఈ వారాంతంలో మళ్లీ నిరసనలకు ఆందోళనకారులు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారాంతంలో అల్లర్లు, దుకాణాల లూటీ చోటుచేసుకోవడంతో ఈసారి భద్రతను కట్టుదిట్టం చేసింది. పారిస్‌తోపాటు పలు నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతోపాటు, బహిరంగ సభలపై ఆంక్షలు విధించింది. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లేదా గ్యాస్ నింపిన సీసాలు, డబ్బాలు, బాణసంచా కలిగి ఉండటాన్ని నిషేధించింది.
వచ్చే వారాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసుల బలగాలను రంగంలోకి దించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల వంటి కీలక ప్రదేశాలకు ఆపరేషన్ సెంటినెల్ కింద సైనికుల భద్రతను కొనసాగించింది. గత వారాంతంలో జరిగిన హింసను అదుపుచేయడంలో ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని అంగీకరించిన నేపథ్యంలో, భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తామని ప్రధాని లెకొర్నూ హామీ ఇచ్చారు. అల్లర్లకు వామపక్ష వర్గాల్లోని కొందరు ఆందోళనకారులే కారణమని ఆరోపించిన అధ్యక్షుడు మాక్రాన్.. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆదివారం హెచ్చరించారు.
ఆన్లైన్లో తప్పుడు ప్రచారాల వెల్లువ
ఫ్రాన్స్‌లో నిరసనలపై ఆన్లైన్లో తప్పుడు ప్రచారం జరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా మితవాద నేతలు.. ఫ్రాన్స్‌లో నెలకొన్న సంక్షోభానికి వలసలే కారణమంటూ ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో ఘర్షణలు, దుకాణాల దోపిడీలు, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడిన జనాల దృశ్యాలతో కూడిన వీడియోలు, ఫొటోలను ఉపయోగించి శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్నదని, ఇస్లామిక్ ఉద్యమం పశ్చిమ దేశాలకు విస్తరిస్తున్నదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ దృశ్యాల్లో కొన్ని ఏండ్ల క్రితం నాటివి, మరికొన్ని ప్రస్తుత విద్యార్థుల నిరసనలకు సంబంధం లేనివి ఉన్నాయి. ఇంకొన్ని తాజా ఘటనలకు సంబంధించినవే అయినప్పటికీ, వాటికి ఆధారాలు లేని ఆరోపణలను జోడించి ప్రచారం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

