టీకా తీసుకోనందుకు.. 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలు సస్పెండ్

పారిస్: గడువులోపు కరోనా టీకా తీసుకోనందుకు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. ఈ వారం డెడ్‌లైన్‌కు ముందు వ్యాక్సిన్ వేయించుకోవడంలో విఫలమైన హెల్త్ వర్కర్స్కు జీతం చెల్లించకుండా డిస్మిస్ చేసినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి ఒలివియర్ వెరాన్ గురువారం తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు, క్లినిక్స్‌లో పని చేసే సిబ్బందిలో టీకా తీసుకోని వారికి ఈ మేరకు బుధవారం నోటీసులు పంపినట్లు చెప్పారు. కాగా, చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు టీకాలు తీసుకునేందుకు ముందుకు రాకపోగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఆరోగ్య సిబ్బంది సస్పెండైనప్పటికీ ప్రజల ఆరోగ్య సంరక్షణకు భరోసా కల్పిస్తామన్నారు.
కాగా, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జూలై నెలలో ఒక ఆర్డర్ జారీ చేశారు. ఆసుపత్రులు, అగ్నిమాపక సేవలు, రిటైర్డ్ హోమ్ వర్క్ సిబ్బందికి అల్టిమేటం ఇచ్చారు. కరోనాపై పోరాటంలో భాగంగా కనీసం ఒక డోస్‌ని సెప్టెంబర్ 15 లోపు తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ ఆ నాటికి వ్యాక్సిన్ వేయించుకోకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
మరోవైపు చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు టీకా వేయించుకునేందుకు ఇష్టపడటం లేదు. టీకా సమర్థత డేటాపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీకా తీసుకోవడంపై గడువు ఆర్డర్, తమ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ కొందరు ఆరోగ్య కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

