మాస్కో, జనవరి 2: సిరియా మాజీ అధ్యక్షుడు, రష్యాలో ఆశ్రయం పొందుతున్న బషర్ అల్ అసద్‌పై విష ప్రయోగం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని జనరల్ ఎస్వీఆర్ పేరుతో సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్న రష్యా మాజీ గూఢచారి వెల్లడించారు.
ఆదివారం మాస్కోలో అసద్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డట్టు చెప్పారు. రష్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులు అసద్ ఉంటున్న అపార్ట్మెంట్లోనే చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలిపారు. అసద్ ఒంట్లో విషం ఉన్నట్టు వైద్యులు గుర్తించారని చెప్పారు.