చీ.. యాక్.. యూరిన్ అమ్మడం ఏంది? అయినా యూరిన్‌ను ఎవరు కొంటారు అంటారా? కానీ ఓ మాజీ మోడల్ యూరిన్ అమ్ముతూ లక్షలు గడిస్తోంది. పిత్తులు అమ్ముతూ కూడా లక్షలు సంపాదించిన మహిళ గురించి ఇదివరకు చదివాం కదా. ఇప్పుడు ఈమె తన యూరిన్‌ను అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది.
ఆమె ఎవరో కాదు.. మాజీ మోడల్, ఫోటోగ్రఫర్ కాక్టస్ కుటీ. యూకేకు చెందిన ఈమె ఒకప్పుడు పెద్ద సెలబ్రిటీ. సోషల్ మీడియా స్టార్. మోడల్ రంగం నుంచి అడల్ట్ కంటెంట్ రంగంలోకి వెళ్లింది. తను ఏం చేసినా సెన్సేషనే. సోషల్ మీడియాలో తనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు.
అందుకే.. తన యూరిన్ కోసం కూడా జనాలు ఎగబడుతున్నారు. ఞక కప్ యూరిన్‌ను రూ.5200 కు అమ్ముతోంది. తన ఫ్యాన్స్ కోసమే యూరిన్‌ను అమ్ముతుంటుంది కుటీ. తను యూరిన్ అమ్మడమే కాదు.. తను మూత్రం పోస్తూ వీడియోను తీసి తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నిజానికి.. ఎవ్వరూ 10 నిమిషాల పాటు యూరిన్ చేయరు. కానీ.. కాక్టస్ మాత్రం 10 నిమిషాల పాటు యూరిన్ పోసి తెగ ఫేమస్ అయిపోయింది. అందుకే.. తన ఫ్యాన్స్ ఆమె యూరిన్‌ను డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. ఎక్కువ మొత్తంలో తన మూత్రాన్ని కొనుగోలు చేసే ఫ్యాన్స్‌కు డిస్కౌంట్లు కూడా అందిస్తుంది కాక్టస్.
ఇంతకీ తన యూరిన్‌ను కొనుక్కొని తన ఫ్యాన్స్ దానితో ఏం చేస్తారో తెలుసా? యూరిన్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని ఐస్‌లాగా చేసి దాచుకుంటారట. వామ్మో.. ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా బాబోయ్.