TRUTH Social | సొంత దుకాణం.. డొనాల్డ్ ట్రంప్ కొత్త సోషల్ నెట్వర్క్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా కొత్త సోషల్ నెట్వర్క్ ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దాని పేరు TRUTH Social.

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా కొత్త సోషల్ నెట్వర్క్ ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దాని పేరు TRUTH Social. ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) దీనికి యజమానిగా ఉంటుంది. వచ్చే నెలలోనే కొందరు ప్రత్యేక ఆహ్వానితులతో ఈ సోషల్ నెట్వర్క్ బీటా వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆపిల్ సంస్థ యాప్ స్టోర్‌లో ఇది ప్రిఆర్డర్పై అందుబాటులో ఉంది. ఈ ఏడాది జనవరిలో క్యాపిటల్ హిల్‌పై దాడి తర్వాత ట్విటర్, ఫేస్బుక్.. ట్రంప్‌పై శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచీ ఆయన సొంత నెట్వర్క్ ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడీ TRUTH Socialతోపాటు ఓ వీడియో ఆన్ డిమాండ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించాలని టీఎంటీజీ భావిస్తోంది. పెద్ద టెక్ కంపెనీల నిరంకుశత్వానికి దీటుగా నిలబడేలా ఈ TRUTH Socialను సృష్టించినట్లు ట్రంప్ తెలిపారు. తాలిబన్లకు కూడా అవకాశం ఉన్న ట్విటర్లో మీకు ఎంతో ఇష్టమైన అమెరికా అధ్యక్షుడికి స్థానం లేకుండా పోయింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని ట్రంప్ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

