బీజింగ్ : టైఫూన్ మసాక్ కారణంగా చైనాలో వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడికి హెంగ్జౌ సిటీలోని ఓ పాముల పెంపకం కేంద్రం దెబ్బతిని సుమారు 900 పాములు తప్పించుకుని వరద నీటిలో గ్రామాల్లోకి వచ్చాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోషల్ మీడియాలోని కొన్ని వీడియోల్లో ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి.
టైఫూన్ మసాక్ వల్ల లియులాన్, యున్బియావో జలాశయాలు పొంగడంతో వరదల తాకిడి పెరిగి పాముల పెంపకం కేంద్రాలు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పాములు మరింత సమస్యగా మారాయి. ఇలా తప్పించుకున్న పాముల్లో కోబ్రా లాంటి విషసర్పాలు ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.