బ్యాంకాక్, ఏప్రిల్ 27: సైన్యం పాలనలో ఉన్న మయన్మార్‌లోని న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించింది. ఆమెపై నమోదైన పలు అవినీతి కేసుల్లో మొదటిగా ఆమెకు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది.
ఆరు లక్షల డాలర్ల నగదు, బంగారం బిస్కెట్లను లంచంగా తీసుకొన్నట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును విచారించిన జుంటా కోర్టు ఆమె అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించి శిక్షను ఖరారు చేసింది.