లండన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు బ్రిటన్‌కు చెందిన స్పేస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ (ఎస్ఈఈ) కంపెనీ సిద్ధమైంది. దీంతో పాటు స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ బ్రాడ్‌క్యాస్ట్ మాడ్యుల్‌ను కూడా సిద్ధం చేయనున్నది. 20 అడుగుల వ్యాసంతో గోళాకారంలో ఉండే ఈ స్టూడియోను 2024లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐఎస్ఎస్కు దీన్ని అనుసంధానించి షూటింగ్‌లు జరుపనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.