కాలిఫోర్నియా: భూమిపై పేరుకుపోతున్న ప్లాస్టిక్ సమస్యకు కాలిఫోర్నియా యూనివర్సిటీపరిశోధకులు చక్కటి పరిష్కారం కనిపెట్టారు. వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కండిష్ లెస్లీ అబ్దుల్ అజీజ్ తన బృందంతో కలిసి ప్లాస్టిక్‌తో బొగ్గును తయారుచేశారు. ఈ బొగ్గును పొలంలో పరిస్తే నేలకు ఎరువుగా ఉపయోగపడటమే కాకుండా నేలలోని తేమను నిలిపి ఉంచేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన వాణిజ్యపరంగా అమల్లోకి వస్తే భూమిపై పేరుకుపోతున్న కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను పంటలకు ఎరువులుగా వాడుకోవచ్చు.