Covid New Variant | ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ రెండు కొత్త వేరియంట్లు..! సింగపూర్‌లో భారీగా పెరుగుతున్న కేసులు..!
Covid New Variant | కరోనా మహమ్మారి ఇంకా కలవరానికి గురి చేస్తూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలకాలంలో కేసులు గణనీయంగా తగ్గుతున్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకరంగానే ఉన్నది. ఇటీవలకాలంలో అమెరికా, యూకే సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.
Covid New Variant | కరోనా మహమ్మారి ఇంకా కలవరానికి గురి చేస్తూనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలకాలంలో కేసులు గణనీయంగా తగ్గుతున్నది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకరంగానే ఉన్నది. ఇటీవలకాలంలో అమెరికా, యూకే సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్లతో కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో పాటు మరణాలు సైతం పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. మరో వైపు మహమ్మారి కారణంగా సింగపూర్‌లో పరిస్థితి దిగజారుతున్నది.
తీవ్రమైన సమస్యలు ఏమి లేకపోయినప్పటికీ.. రెండు వేరియంట్ల కారణంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది. మీడియా నివేదికల ప్రకారం సింగపూర్‌లో రోజవారీ కొవిడ్ కేసులు రెండువేల మార్క్‌ను దాటాయి. మూడువారాల కిందట రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి దిగువన ఉండగా.. క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అయితే, ఇటీవల రెండు కొవిడ్ కొత్త వేరియంట్లను గుర్తించారు. వీటి కారణంగానే రోగుల సంఖ్య పెరుగుతోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పౌరులందరూ తప్పనిసరిగా కొవిడ్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.
రెండు వేరియంట్లతోనే..
సింగపూర్‌లో పెరుగుతున్న కొవిడ్ కేసులకు రెండు కొవిడ్ కొత్త వేరియంట్లే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. EG.5 వేరియంట్‌తో పాటు దాని సబ్ వేరియంట్ HK.3 ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటు ఈ రెండు ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్లు. ఇటీవలకాలంలో 75శాతం కేసులు పెరుగడానికి ఈ రెండు వేరియంట్లే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైరస్ ఉధృతిని చూస్తే.. రాబోయే రోజులు మరింత విస్తరిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఊరట కలిగించే విషయమేంటంటే రెండు వేరియంట్ల కారణంగా తీవ్రమైన సమస్యలేమీ లేవని, అంత ప్రమాదమేమి కారణం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఆరోగ్యశాఖ మంత్రి ఏమన్నారంటే..
సింగపూర్‌లో కొవిడ్ పరిస్థితిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ పేర్కొన్నారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచినట్లు పేర్కొన్నారు. వైరస్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. కొత్త కేసులతో తీవ్రమైన సమస్యలున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయన్నారు. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. నివారణ చర్యలు పాటించాలని సూచించారు. కొత్త వేరియంట్లతో ఇన్ఫెక్షన్ రేటు పెరగడంతో రాబోయే వారాల్లో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. అయితే, వైరస్ కారణంగా పెద్దగా ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
రెండు వేరియంట్లపై అధ్యయనం..
సింగపూర్‌లో కేసుల పెరుగుదలకు కారణమైన EG.5, HK.3 వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొత్త వేరియంట్ల స్వభవాన్ని అర్థం చేసుకునేందుకు నిపుణులు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. కొత్త వేరియంట్ల జీనోమ్ సీక్వెన్సింగ్ HK.3 డబుల్ మ్యూటాంట్ వేరియంట్ అని ఓ అధ్యయనం పేర్కొంది. ఇది XBB.1.16 జాతికి చెందిన వేరియంట్ కంటే 95శాతం వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒమిక్రాన్‌కు చెందిన ఇతర రూపాంతరాల మాదిరిగా.. వేరియంట్ శరీర రోగనిరోధకశక్తి నుంచి సులభంగా తప్పించుకునే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అయితే, గతంలో థాయ్‌లాండ్‌లోనూ HK.3 కేసులు తొలిసారిగా కనిపించాయి. అయితే, అక్కడ మాత్రం కేసులు పెగిరినట్లు మాత్రం కనిపించకపోవడం గమనార్హం. అయితే, సింగపూర్‌లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

