వాషింగ్టన్ : కొందరు చిన్నారుల చావులకు కొవిడ్ టీకా కారణమని అమెరికా ఆహార, ఔషధ పరిపాలన విభాగం (ఎఫ్డీఏ) చేసిన వాదనపై నిపుణులు భగ్గుమన్నారు. ప్రభుత్వ వాదన బాధ్యతా రాహిత్యమని, ప్రమాదకరమని వారు వ్యాఖ్యానించారు. పిల్లల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణమన్న ఎఫ్డీఏ.. టీకా అనుమతి ప్రొటొకాల్ను కఠినం చేయాలని అంతర్గత మెమో పంపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎఫ్డీఏ టీకా విభాగం డైరెక్టర్ వినయ్ ప్రసాద్ ఈ మెమోను జారీ చేశారు. కనీసం పది మంది చిన్నారులు కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత చనిపోయారని ఆయన పేర్కొన్నారు. టీకా వ్యతిరేక వ్యూహకర్తల అందించిన డాటా పట్టుకొని ఎఫ్డీఏ ఈ మాటలను అంటోందని ఎఫ్డీఏ టీకా విభాగం మాజీ అధిపతి పీటర్ అన్నారు.