FBI : అమెరికా నిఘా విభాగం భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది. హాలోవీన్ వీకెండ్(Halloween Weekend) ముసుగులో దాడికి పాల్పడాలనుకున్న వారికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ బృందం (FBI) చెక్ పెట్టింది. మిచిగాన్ రాష్ట్రంలో కొందరు ఉగ్రదాడులకు పన్నాగం పన్నుతున్నారనే సమాచారంతో అప్రమత్తమైన ఎఫ్‌బీఐ.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. స్థానిక అధికారుల సహకారంతో తమ నిఘా విభాగం ఉగ్ర కుట్రను భగ్నం చేసిందని శుక్రవారం ఎఫ్‌బీఐ చీఫ్ కశ్ పటేల్(Kash Patel) వెల్లడించారు.
హాలోవీన్ వీకెండ్ పేరుతో ఉగ్రదాడికి పాల్పడాలని అనుకున్న వారి పేర్లు, ఇంతకూ వారు ఏరకమైన విధ్వంసానికా ప్రణాళికలు రచించారు? అనే వివరాలను మాత్రం కశ్ పటేల్ వెల్లడించలేదు. సమాచారం తెలియగానే వెంటనే స్పందించి భారీ ఉగ్రదాడిని అరికట్టిన స్థానిక అధికారులను ఎక్స్ వేదికగా ఎఫ్‌బీఐ చీఫ్ అభినందించారు.
🚨 BREAKING: In an incredible success, Kash Patel and Dan Bongino’s FBI just THWARTED a potential terrorist attack in Michigan, arresting several people
“Thanks to the men and women of FBI and law enforcement everywhere standing guard 24/7 and crushing our mission to defend the… pic.twitter.com/i9Mm6maX1r
— Eric Daugherty (@EricLDaugh) October 31, 2025
‘మిచిగాన్‌లో కొందరు భారీ స్థాయిలో ఉగ్రదాడికి వ్యూహ రచన చేశారు. అయితే.. వారి కుట్రను ఈరోజు ఉదయం ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు. హింసాత్మక ఘటనలకు ప్రణాళికలు చేసిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఈ కుట్రను ఛేదించేందుకు.. మనదేశాన్ని కాపాడేందుకు రోజూ 24 గంటలు పనిచేసిన మహిళా, పురుష సిబ్బందికి ధన్యవాదాలు’ అని ఎక్స్ పోస్ట్‌లో కశ్ పటేల్ పేర్కొన్నారు.