Catherine Connolly : ఐర్లాండ్ (Irland) అధ్యక్ష ఎన్నికల (Presidential elections) లో వామపక్షవాద స్వతంత్ర నేత కేథరీన్ కన్నోలి (Catherine Connolly) ఏకపక్షంగా ఘన విజయం సాధించారు. ఆమెకు సిన్ ఫెయిన్తోపాటు వామపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చాయి. దాంతో ఆమె ప్రత్యర్థి, సెంటర్ రైట్ పార్టీ అయిన ఫైన్ గాయెల్ (Fine Gael) అభ్యర్థి హీథర్ హంప్రేయ్స్ (Heather Humphreys) ఘోర పరాజయం పాలయ్యారు.
ఈ ఎన్నికల్లో కేథరీన్కు మొదటి ప్రాధాన్య ఓట్లలోనే ఏకంగా 63 శాతం ఓట్లు దక్కాయి. హంప్రేయ్స్ కేవలం 29 శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. కాగా బారిస్టరు అయిన కన్నోలి.. 2016 నుంచి చట్టసభ సభ్యురాలిగా ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆమె బహిరంగంగా వ్యతిరేకించారు. ఇజ్రాయెల్ను టెర్రరిస్టు దేశంగా అభివర్ణించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరోపా కూటమి సైనికీకరణనూ తప్పుబట్టారు. ప్రస్తుతం ఐర్లాండ్ అధ్యక్షులుగా మైఖేల్ డి హిగ్గిన్స్ ఉన్నారు.