ఇస్లామాబాద్: రెస్టారెంట్లో ఒక కుర్చీ కోసం రెండు కుటుంబాల మధ్య ఫైట్ జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. (Families Slap, Punch Each Other) రెస్టారెంట్ సిబ్బంది, పోలీసుల జోక్యంతో వివాదం ముగిసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పొరుగు దేశమైన పాకిస్థాన్లోని కరాచీలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 27న ఖయాబాన్-ఎ-సహర్లోని ఒక రెస్టారెంట్లో రెండు కుటుంబాల వారు పక్కపక్కనే కూర్చున్నారు. కుర్చీలు ఖాళీ లేకపోవడంతో కొందరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు.
కాగా, కొందరు మహిళలు లేచి వెళ్లడంతో ఖాళీ అయిన కుర్చీని ఒక మహిళ తీసుకుంది. దీని గురించి ఆ మహిళలు వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు కుటుంబ సభ్యుల మధ్య మాటల వాడి పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు చెందిన వారు, మహిళలతో సహా కొట్టుకున్నారు. చెంపలు చెళ్లుమనిపించుకోవడంతోపాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
మరోవైపు రెస్టారెంట్లో కొట్టుకున్నవారిలో సింధు హోం సెక్రటరీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే ఇరు కుటుంబాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే ప్రముఖుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఇరు పక్షాలు రాజీపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ ఘర్షణపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కాగా, రెస్టారెంట్లో కుర్చీ కోసం రెండు కుటుంబాల సభ్యులు కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A restaurant in Karachi’s DHA on Oct 27 pic.twitter.com/Pw6ThH8HI4
— omar r quraishi (@omar_quraishi) October 28, 2024