శృంగారం అంటేనే మధురమైన అనుభూతి. అలాంటి అనుభూతి కోసం ఇద్దరు భార్యాభర్తల మధ్య జరిగే రొమాన్స్, చిలిపి పనులు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఆ సమయాన్ని ఎంతో రసరమ్యంగా గడిపేస్తారు. కానీ ఆ శృంగారంలో భావప్రాప్తి ( Orgasm Day ) పొందడమే ప్రధానమైన అంశం. భావప్రాప్తి పొందని యెడల.. ఆ దంపతుల బాధలు వర్ణనాతీతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే భావప్రాప్తికి శృంగారంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు.
పలు దేశాల్లో భావప్రాప్తి ( Orgasm Day ) దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, కెనడా, జర్మనీ లాంటి దేశాల్లో ప్రతి ఏడాది జులై 31న జాతీయ భావప్రాప్తి దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ దేశాల్లో వుమెన్స్ ఆర్గాజమ్ డేను కూడా ఆగస్టు 8న నిర్వహించుకుంటారు. ఈ దినోత్సవాలను జరుపుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన శృంగార జీవితం కోసమే అని ఆ దేశస్తులు పేర్కొంటున్నారు. భావప్రాప్తి పొందక మనో వేదనకు గురవుతున్న దంపతుల్లో దీనిపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించేందుకే అని తెలిపారు.
అయితే న్యూయార్క్ యూనివర్సిటీ డాక్టర్ జహానా వ్రంగ్లోవా పరిశోధన ప్రకారం.. శృంగారం సమయంలో దంపతులు చేసే శబ్దాలు భావప్రాప్తికి ఎంతో ఉపకరిస్తాయని తేలింది. భావప్రాప్తి పొందేందుకు ఆ సమయంలో చేసే శబ్దాలు చాలా పని చేస్తాయని డాక్టర్ జహానా పేర్కొన్నారు. శబ్దాలతో సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి.. దీని వల్ల ఆనందం పొందుతాం అని దంపతులు చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు భావప్రాప్తి పొందడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పారు.
శృంగారం సమయంలో ఉద్రేకాలు కలగడంతో 75 శాతం మంది మహిళలు ఒకటి కంటే ఎక్కువ సార్లు భావప్రాప్తి పొందుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఉద్రేకాలతోనే ఇరువురు దంపతుల మధ్య శృంగారంలో కమ్యూనికేషన్ ఉంటుందని, అప్పుడు భావప్రాప్తి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.