టెహ్రాన్: టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ బదులు తీర్చుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిమిషం పాటు వేచి ఉండేలా చేశారు. దీంతో ఎర్డోగాన్ రాక కోసం సుమారు 50 సెకండ్ల పాటు ఎదురు చూడటాన్ని పుతిన్ భరించలేకపోయారు. ఆయన ముఖంలో ఆ హావాభావాలు స్పష్టంగా కనిపించాయి. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి టర్కీ పర్యటనకు వెళ్లారు. నాటో కూటమి సభ్య దేశాధినేత తయ్యిప్ ఎర్డోగాన్‌తో మంగళవారం ఆయన అధికారికంగా సమావేశమయ్యారు.
కాగా, షెడ్యూల్ ప్రకారం సమావేశ మందిరానికి వెళ్లిన పుతిన్ అక్కడ కుర్చీలు ఖాళీగా ఉండటాన్ని చూశారు. దీంతో ఎర్డోగాన్ రాక కోసం సుమారు 50 సెకండ్ల పాటు ఎదురు చూశారు. ఈ సందర్భంగా ఆయన హావాభవాలు అక్కడున్న మీడియా కంటికి చిక్కాయి. ఖాళీ కుర్చీలను ఎగాదిగా చూశారు. రెండు చేతులను ముందువైపు కట్టుకుని తన కుర్చీ వద్ద నుల్చొని ఉన్నారు. ముఖం, పెదాలను కదిలిస్తూ అసహనం ప్రదర్శించారు. అనంతరం ఎర్డోగాన్ అక్కడి రాగానే తన హావాభావాలను మార్చివేశారు. ఆ తర్వాత చిరునవ్వుతో ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
2020లో మాస్కో పర్యటనకు వెళ్లిన ఎర్డోగాన్‌కు ఇలాంటి అనుభవం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కోసం ఆయన సుమారు రెండు నిమిషాలపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో ఎర్డోగాన్ తాజాగా పుతిన్‌ను వేచి ఉంచి ఇలా బదులు తీర్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టర్కీ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు 2013లో పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీకి కూడా పుతిన్ 50 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు.
— Christo Grozev (@christogrozev) July 19, 2022