శాన్ఫ్రాన్సిస్కో, జనవరి 23: కొవిడ్ రెండో బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకున్నాక చాలా ఇబ్బందైందని, చనిపోతానేమోనని అనిపించిందని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. తన అనుభవాన్ని ఆయన ట్వీట్ చేశారు. రెండో బూస్టర్ తర్వాత తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, చనిపోతానేమోనని చాలా రోజుల పాటు అనిపించిందన్నారు. అదృష్టవశాత్తూ తర్వాత కోలుకున్నట్లు చెప్పారు. తన కజిన్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని, దవాఖానకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జర్మనీలోని టెస్లా గిగాకు వెళ్తున్నప్పుడు అయిష్టంగానే రెండో బూస్టర్ డోసు వేసుకున్నట్లు తెలిపారు. ముందు డోసులు తీసుకున్నప్పుడు పెద్దగా ఇబ్బంది అనిపించలేదని, రెండో బూస్టర్ డోసు వల్లనే చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు.