ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పూణేకు చెందిన ప్రణయ్ పాథోలేతో ఆయనకు స్నేహం ఏర్పడింది. ప్రణయ్ చేసిన ఒక ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇచ్చాడు. అప్పటి నుంచి వీరిద్దరి ఆన్లైన్ స్నేహం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే టెక్సాస్ వెళ్లిన ప్రణయ్.. అక్కడి టెస్లా ఫ్యాక్టరీలో మస్క్‌ను కలిశాడు. ఈ కుబేరుడితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రణయ్.. ‘‘ఇంత వినయం, మంచితనం ఉన్న వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు. మీరు లక్షలమందికి స్ఫూర్తి’’ అంటూ పోస్టు పెట్టాడు.
It was so great meeting you @elonmusk at the Gigafactory Texas. Never seen such a humble and down-to-earth person. You're an inspiration to the millions 💕 pic.twitter.com/TDthgWlOEV
— Pranay Pathole (@PPathole) August 22, 2022