లాస్ ఏంజిల్స్: గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షానహన్తో ఎటువంటి అఫైర్ లేదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. మస్క్, బ్రిన్ ఒకప్పుడు మంచి మిత్రులు. అయితే బ్రిన్ భార్య నికోల్తో మస్క్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు గత వారం ఓ కథనం వచ్చింది. ఇటీవల బ్రిన్, అతని భార్య నికోల్ వేరుపడ్డారు. డైవర్స్ కోసం కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సమయంలో నికోల్, మస్క్ మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తాను క్రేజీ అవర్స్‌లో పనిచేస్తుంటానని, తనకు ఎటువంటి అఫైర్ కుదిరే వీలు లేదని మస్క్ తన ట్వీట్లో తెలిపారు. బ్రిన్ తాను ఇంకా మంచి ఫ్రెండ్స్ అన్న సంకేతాన్ని వినిపించారు. నికోల్‌ను మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే చూవానని, రెండుసార్లు ఆమె చుట్టు చాలా మంది ఉన్నారని, దీంట్లో రొమాంటిక్ ఏమీ లేదని మస్క్ గతంలో తెలిపాడు. మస్క్‌తో అఫైర్ ఉందని తెలిసిన తర్వాతే బ్రిన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.