వాషింగ్టన్: కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) హోండురస్‌కు ఉత్తర దిశలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైనట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ (USGS) వెల్లడించింది. కెమెన్ దీవుల తీరానికి 209 కిలోమీటర్ల దూరంలో ప్రకంపణలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, హోండురస్, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై కూడా భూకంపం ప్రభావం కనిపించింది. సునామీ అలాలు క్యూబా తీరాన్ని తాకే అవకాశం ఉందని, 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని యూఎస్ నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. అదేవిధంగా కెమెన్ ఐలాండ్స్, జమైకా, క్యూబా, మెక్సికో, హోండురస్, బహమాస్, బెలిజ్, హైతి, కోస్టారికా, పనామా, నికరాగువా, గ్వాటేమాలా తీరాలను చేరుకోవచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
A powerful 8.0 magnitude earthquake has struck by Cayman Islands. It was an under water earthquake which results in Tsunami threats 😳 pic.twitter.com/vgaG8xK5IQ
— Adjusted55 (@BillPrinter00) February 9, 2025