Earthquake | ఇండోనేషియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ ముప్పు లేదన్న యూఎస్జీఎస్
ఇండోనేషియాలోని (Indonesia) బాలి సముద్ర ప్రాంతంలో (Bali Sea region) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
బాలీ: ఇండోనేషియాలోని (Indonesia) బాలి సముద్ర ప్రాంతంలో (Bali Sea region) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. మతారామ్కు (Mataram) ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలలికలు సంభవించాయని పేర్కొంది.
కాగా, భూకంప తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. అయితే సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. ఇక 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది.
Earthquake of Magnitude:6.5, Occurred on 29-08-2023, 01:25:32 IST, Lat: -6.86 & Long: 116.52, Depth: 518 Km ,Region: Bali Sea for more information Download the BhooKamp App https://t.co/wcH4I8Om0D pic.twitter.com/1fV6xqejAe
— National Center for Seismology (@NCS_Earthquake) August 28, 2023
అదేవిధంగా మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది.
Earthquake of Magnitude:4.3, Occurred on 29-08-2023, 03:50:10 IST, Lat: 11.46 & Long: 93.34, Depth: 10 Km ,Location: Andaman Sea for more information Download the BhooKamp App https://t.co/79NJSiA69P@Dr_Mishra1966 @KirenRijiju @ndmaindia @Indiametdept pic.twitter.com/Z8SBVEIqcz
— National Center for Seismology (@NCS_Earthquake) August 28, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | ‘మూక్కుత్తి అమ్మన్-2’ నా హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా.. నయనతార ఎమోషనల్ పోస్ట్ వైరల్
Mahatma Gandhi Grandson: అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
Health tips | అరటిపండుతో అన్నీ లాభాలే.. అవేంటో తెలుసా..?
Smartphone Sales | పండుగ సీజన్లో తగ్గిన ఫోన్లు, టీవీల అమ్మకాలు.. దుకాణాల్లో పేరుకుపోయిన స్టాక్.. కంపెనీల కీలక నిర్ణయం !!
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

