Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
Japan Earthquake | జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. నైరుతి జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మియాజాకి ప్రిఫెక్చర్లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.26 గంటలకు భూకంపం సంభవించినట్లుగా జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. భూకంపంతో ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లుగా సమాచారం అందలేదు. భూమికి 37 కిలోమీట్ల లోతులో భూకంప కేంద్రం గురించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం పేర్కొంది. వాస్తవానికి పసిఫిక్ బేసిన్లో తరుచూగా భూకంపాలు వస్తుంటాయి.
గతేడాది ఆగస్టు 8న వరుస భూకంపాలు జపాన్ను వణికించాయి 6.9, 7.1 తీవ్రతతో వరుస భూకంపాలు వచ్చాయి. క్యుషు, షికోకులో భూకంపాలు వచ్చాయి. గతేడాది జనవరి ఒకటిన సుజు, వాజిమా పరిసర ప్రాంతాల్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం రాగా.. దాదాపు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణమే అయినా.. అప్పుడప్పుడు భారీ భూకంపాలు వస్తుంటాయి. ఈ ఏడాది జనవరి 7న టిబెల్‌లో వరుస భూకంపాలు వచ్చాయి. దాదాపు 126 వరకు ప్రాణాలు కోల్పోగా.. చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. 300 మందికిపైగా గాయపడ్డారు. టిబెట్‌లోని టింగ్రి కౌంటీలో వచ్చిన భూకంపంతో భారత్, నేపాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు రికార్డయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

