Earth’s Core | వ్యతిరేక దిశలో భూకేంద్ర మండలం.. భూమితో పోలిస్తే తగ్గిన భ్రమణ వేగం
భూమి తిరుగుతున్నట్టుగా భూ అంతర్భాగం తిరగడం లేదని అంటున్నారు పరిశోధకులు. భూమి కంటే తక్కువ వేగంతో, వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Earth’s Core | న్యూయార్క్, జూలై 8: భూమి తిరుగుతున్నట్టుగా భూ అంతర్భాగం తిరగడం లేదని అంటున్నారు పరిశోధకులు. భూమి కంటే తక్కువ వేగంతో, వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూమి లోపల బంతిలా ఉండే భూ కేంద్ర మండలం(కోర్) ఇంతకుముందు భూమి కంటే వేగంగా తిరిగేదని, ఆ తర్వాత సమానంగా, ఇప్పుడు తక్కువ వేగంతో తిరుగుతున్నదని పరిశోధకులు తేల్చారు.
చుట్టూ ద్రవరూపంలో ఉన్న పొరలు ఒకవైపు తిరుగుతుంటే, వాటికి వ్యతిరేక దిశగా భూ కేంద్రమండలం తిరుగుతున్నట్టు తేల్చారు. భూ కేంద్ర మండలం తిరిగే వేగం మారుతున్నదని 2023లో ఒక అధ్యయనంలో తేలగా, ఇప్పుడు తాజా అధ్యయనం ఈ వాదనను బలపరుస్తున్నది.
అంతేకాదు, 70 ఏండ్ల కాలచక్రంతో ఇది తిరిగే వేగం మారుతున్నదని సైతం ఈ అధ్యయనం తేల్చింది. భూ ఉపరితలానికి 5,180 కిలోమీటర్ల లోతులో ఉండే భూ కేంద్ర మండలంపై ప్రత్యక్షంగా పరిశోధనలు జరపడం అసాధ్యం. పెద్ద భూకంపాలు సంభవించినప్పుడు రికార్డయ్యే తరంగాలను విశ్లేషించి పరిశోధకులు ఈ కొత్త విషయాలను వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

