శృంగారంపై ఆసక్తి లేకుంటే ముందస్తు మరణం!
శృంగారంపై ఆసక్తి లేని మగవారికి ముందస్తు మరణ ముప్పు ఉంటుందని జపాన్లోని యమగాటా విశ్వ విద్యాలయం అధ్యయనం వెల్లడించింది! 6 ఏండ్ల పాటు 40 ఏండ్ల పైబడి వయసున్న 21 వేల మందిపై అధ్యయనం చేశాక పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు.
టోక్యో: శృంగారంపై ఆసక్తి లేని మగవారికి ముందస్తు మరణ ముప్పు ఉంటుందని జపాన్లోని యమగాటా విశ్వ విద్యాలయం అధ్యయనం వెల్లడించింది! 6 ఏండ్ల పాటు 40 ఏండ్ల పైబడి వయసున్న 21 వేల మందిపై అధ్యయనం చేశాక పరిశోధకులు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఎలాంటి పని ఒత్తిడులు లేని పర్వత ప్రాంత ప్రకృతి అందాలకు నిలయమైన యమగాటా ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. శృంగారంలో చురుగ్గా ఉండటం పెద్ద వయసులో ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుందని ఇటీవల కాలంలో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శృంగారంలో ఆసక్తి లేకపోవడం లేదా పాల్గొనకపోవడం అంతర్గత ఆరోగ్య సమస్యలకు కారణమై ఉండొచ్చన్న అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. యమగాటా వర్సిటీ అధ్యయన సమయంలో 503 మంది చనిపోయారు. వీరిలో క్యాన్సర్ వల్ల, ఇతర అన్ని కారణాల వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ కారణాల వల్ల చనిపోయిన వారికి శృంగారంపై ఆసక్తి లేదని అధ్యయనం పేర్కొంది. పురుషుల కంటే మహిళలు శృంగారంపై ఎక్కువగా అనాసక్తి చూపిస్తున్నారని, 16 శాతం మంది మహిళలు, 8 శాతం మంది పురుషులు తమ అనాసక్తిని వెల్లడించారని చెప్పింది. కానీ దీనికి, మహిళల మరణాలకు ఉన్న సంబంధాన్ని పరిశోధకులు కనుక్కోలేకపోయారు. ఈ అంశంపై మరింత అధ్యయనం చేయాలని పరిశోధకులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

