న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ‘ఇన్స్టాగ్రామ్’ ద్వారా భర్తకు విడాకులు పంపి సంచలనం సృష్టించిన దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా అల్ మక్తోమ్ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేశారు. ‘డివోర్స్’ పేరుతో సరికొత్త పర్ఫ్యూమ్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
‘ఇన్స్టాగ్రామ్’లో తన కొత్త ప్రొడక్ట్ టీజర్‌ను ఆమె విడుదల చేశారు. విరిగిన గాజు, నల్ల చిరుతను ఆ వీడియోలో చూపెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 30 ఏండ్ల షేక్ మహ్రా 2023 మేలో దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. కొద్ది నెలల క్రితమే వారికి ఒక పాప జన్మించింది. ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నాడంటూ తన భర్తకు జూలైలో ఇన్స్టాద్వారా ఆమె విడాకులు పంపింది.