ఇటలీలో తీవ్ర నీటి కొరత.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
రోమ్: ఉత్తర ఇటలీలో తీవ్ర నీటి కరువు ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. పో నది చుట్టు ఉన్న ప్రాంతాలు బీడు భూములవుతున్నాయి. గడిచిన 70 ఏళ్లలో ఎన్నడూ ఈ రీతిలో కరువు ఏర్పడలేదు. ఎమిలియా రోమగ్న, ఫ్రూలీ వెంజియా గులియా, లొంబార్డీ, పీడమాంట్, వెనిటో ప్రాంతాలకు ప్రత్యేక ఎమర్జెన్సీ నిధుల ప్యాకేజీ ప్రకటించారు. నీటి కొరత వల్ల ఇటలీ వ్యవసాయ ఉత్పత్తుల్లో 30 శాతం దిగుబడి తగ్గనున్నది. ఈ ప్రాంతంలోని అనేక మున్సిపాల్టీల్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. ఊహించని రీతిలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ స్థాయిలో వర్షం నమోదు కావడం వల్ల ఉత్తర ఇటలీలో నీటి ఎద్దడి ఏర్పడింది. ఇటలీలో పో నది అత్యంత పొడువైనది. తూర్పు దిశగా సుమారు 650 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. నదిలోకి ఉప్పు నీరు ప్రవహిస్తోందని, దీంతో పో నది పరివాహాక ప్రాంతంలో ఉన్న పంటలు నాశనం అవుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

