CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
CJP : కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ఆందోళనకు బయల్దేరిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. ఈ ముగ్గురిని కోర్టు విడుదల చేసింది.
CJP : కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వానికి కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ఆందోళనకు బయల్దేరిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా.. ఈ ముగ్గురిని కోర్టు విడుదల చేసింది. శనివారం ఢిల్లీలో దిగగానే వీరిని విమానంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సీజేపీ నాయకులను వెంటనే విడదుల చేయాలని న్యాయమూర్తి పోలీసులకు తెలిపారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపినిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి గుడ్‌న్యూస్. కీలక నేతలను అరెస్ట్ చేసి నిరసనలు అడ్డుకోవాలని చూసిన పోలీసుల ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్ట వేసింది. వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను విడుదల చేసింది. వీరిని ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం ఉదయం ఢిల్లీలోని కంటోన్మెంట్ పరిధిలోని కోర్టులో హాజరుపరిచారు.
అక్కడ విచారణ అనంతరం ‘ఒక ఏడాది పాటు శాంతికి భంగం కలిగించవద్దు’ అనే షరుతో దీప్కే బృందం విడుదలకు కోర్టు ఆదేశాలిచ్చింది. దాంతో.. దీప్కే, దాస్, రంకలు తమ మద్దతుదారులకు అభివాదం చేశారు. కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దీప్కే స్వగ్రామం వెళ్లే అవకాశముంది. దాస్, రంకలు నేరుగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో పాల్గొననున్నారు.
VIDEO | Delhi: Executive Magistrate’s court releases CJP founder Abhijeet Dipke, and party leaders Saurav Das, Ashutosh Ranka. Visuals from Delhi Cantonment Police Station.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) https://t.co/UweLl56dyU
— Press Trust of India (@PTI_News) October 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

