Watch: షాపింగ్ మాల్‌లోకి దూసుకెళ్లిన కారు… ఇద్దరు ఉద్యోగులకు గాయాలు
వాషింగ్టన్: ఒక షాపింగ్ మాల్‌లోకి కారు దూసుకెళ్లింది. దీంతో అందులో పని చేసే ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. అమెరికాలోని టెంపే నగరంలో ఈ ఘటన జరిగింది. తెల్ల రంగులో ఉన్న కారు ఆ షాపింగ్ మాల్ వద్దకు వచ్చింది. డ్రైవర్ బ్రేక్‌పై కాలు వేయబోయి ఏక్సలరేటర్పై వేశాడు. దీంతో ఆ కారు షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారం నుంచి లోనికి దూసుకెళ్లింది. లోపల మాట్లాడుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను బలంగా ఢీకొట్టింది. ఆ షాపింగ్ మాల్లో వస్తువులున్న కొన్ని ర్యాక్‌లను ధ్వంసం చేసింది. అయితే ఈ ర్యాక్‌ల వల్ల ఆ ఇద్దరు ఉద్యోగులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న టెంపే నగర పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ప్రమాదం వల్ల షాపింగ్ మాల్లోని కొన్ని ర్యాక్‌లు ధ్వంసమయ్యాయని యజమాని తెలిపాడు. ఈ నేపథ్యంలో రిపేర్ కోసం కొన్ని రోజుల పాటు షాపింగ్ మాల్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు షాపింగ్ మాల్‌లోకి కారు దూసుకెళ్లి ఇద్దరు ఉద్యోగులను గాయపర్చిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Wow check out this close call!! The driver accidentally left the car in drive and tries to put it in park and unintentionally hit the accelerator. Thankfully only minor injuries! pic.twitter.com/03OWUN9o6c
— Tempe Police Department (@TempePolice) May 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

