అమెరికాలోని టెంపే ప్రాంతంలోని దుకాణంలోకే ఏకంగా కారు చొచ్చుకెళ్లింది. దుకాణంలోని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోను టెంపో పోలీసులు విడుదల చేశారు. దుకాణంలోని ఇద్దరు వ్యక్తులు హాయిగా మాట్లాడుకుంటుండగా.. అకస్మాత్తుగా ఆ కారు షాపులోకి చొచ్చుకొచ్చింది. దాదాపుగా 25 ఫీట్లు షాపులోకి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దర్ని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్పై కాలు వేసే బదులు, ఎస్క్లేటర్పై కాలు వేయడంతో కారు వేగంగా షాపులోకి దూసుకొచ్చిందని పేర్కొంటున్నారు. అయితే తాము భూకంపం వచ్చిందని అనుకున్నామని, కానీ తేరుకునే సరికి అక్కడ కారు ఉందని షాపులో ఉన్నవాళ్లు పేర్కొన్నారు.
ప్రమాదంలో గాయపడిన సేల్స్ మెన్ తలకు, మోకాలుకు, చేతులకు విపరీతమైన గాయాలయ్యాయి. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే వుందని, ఇబ్బందులేమీ లేవని వైద్యులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Wow check out this close call!! The driver accidentally left the car in drive and tries to put it in park and unintentionally hit the accelerator. Thankfully only minor injuries! pic.twitter.com/03OWUN9o6c
— Tempe Police (@TempePolice) May 26, 2022