న్యూఢిల్లీ : యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోవడంతో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతైందని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. సోమవారం దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ తీరప్రాంతంలో రెస్క్యూ బృందాలు 76 మృతిదేహాలను వెలికితీశాయి.
మరో 32 మందిని రక్షించాయి. దాదాపు 157 మంది ఇథియోపియన్ వలసదారులతో బయల్దేరిన పడవ బలమైన గాలుల దాటికి శనివారం అబ్యాన్ ప్రావిన్స్ తీరంలో నీట మునిగింది. వీరంతా ఇథియోపియన్ జాతీయులేనని, మెరుగైన ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నట్టు గుర్తించారు.