లండన్: కరోనా సోకడంతో కోమాలోకి వెళ్లిన ఓ నర్సుకు వైద్యులు ప్రయోగాత్మకంగా ‘వయాగ్రా’ మందు ఇవ్వడంతో 28 రోజుల తర్వాత ఆమె మేల్కొంది. బ్రిటన్లోని లికోన్షైర్కు చెందిన 37 ఏండ్ల మోనికా అల్మెడాకు కొవిడ్ సోకడంతో నవంబర్ 9న దవాఖానలో చేర్పించారు. వారం తర్వాత ఐసీయూలో ఉంచి చికిత్స అందించడం ప్రారంభించారు. నవంబర్ 16న ఆమె కోమాలోకి వెళ్లింది.
శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు వాడే వయాగ్రా మం దును అధిక మోతాదులో డాక్టర్లు ఆమెకు ఇచ్చారు. దీంతో శరీరం మొత్తానికి రక్త ప్రసరణ బాగా జరిగి కోమా నుంచి బయటపడి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయులు పెరిగేందుకు దోహదపడే నైట్రిక్ ఆక్సైడ్ మాదిరిగానే వ యాగ్రా కూడా పనిచేస్తుందా అనే దానిపై పరిశోధనలు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.