వాషింగ్టన్: నవజాత శిశువులకు కొత్త సమాఖ్య పెట్టుబడి పథకాన్ని డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రారంభించారు. శిశువుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ట్రంప్ పేరు మీద ఉన్న ఈ పెట్టుబడి ఖాతాలను 2025-2028 మధ్య జన్మించిన శిశువుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. దీని కింద ఈ మూడేండ్లలో జన్మించిన పిల్లలందరికీ యూఎస్ ట్రెజరీ పెట్టుబడి ఖాతాల్లో వెయ్యి డాలర్లు (రూ.92 వేలు)చొప్పున జమ చేస్తారు.
కుటుంబాలు ప్రతి ఏడాది గరిష్ఠంగా 5 వేల డాలర్లు కనుక ఈ ఖాతాల్లో జమ చేసినట్టయితే ఆ బాలుడు/బాలికకు 28 ఏండ్ల వయసు వచ్చేటప్పటికి అది 1.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1 కోటి) అవుతుంది.