Donald Trump | ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది.. ఇక హర్మూజ్ తెరిచే ఉంటుంది..!
Donald Trump : ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) శుభవార్త చెప్పారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని, హర్మూజ్ జలసంధి(HormuzStrait) ఇకపై తెరిచే ఉంటుందని ట్రంప్ వెల్లడించారు.
Donald Trump : ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) శుభవార్త చెప్పారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని, హర్మూజ్ జలసంధి(HormuzStrait) ఇకపై తెరిచే ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. ఓవైపు హర్మూజ్ గుండా అంతర్జాతీయ జల రవాణాకు అడ్డంకులు తొలిగాయనే విషయాన్ని చెబుతూనే.. మరోవైపు ఇరాన్‌కు హెచ్చరికలు చేశారు ట్రంప్. ఒకవేళ ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడంలో విఫలమైతే తాము తిరిగి దాడులను కొనసాగిస్తామని అమెరికా అధినేత స్ఫష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరపడిందని తొలుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఇరాన్, అమెరికా సత్వరమే శాశ్వత ఒప్పందానికి వచ్చాయని, లెబనాన్‌పై దాడులతో సహా అన్నిరకాల సైనిక చర్యలను నిలిపి వేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని ఎక్స్ పోస్ట్‌లో షరీఫ్ తెలిపారు. కాసేపటికే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ డొనాల్ట్ ట్రంప్ ప్రకటన చేశారు. దౌత్యపరమైన చర్చలు సఫలీకృతమైందని, గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ఎండ్ కార్డ్ పడిందని అమెరికా అధినేత స్పష్టం చేశారు.
JUST NOW: In a historic, monumental breakthrough for global stability, President Trump has officially announced that the comprehensive peace deal with the Islamic Republic of Iran is 100% complete. 🇮🇷🇺🇸👏
President authorized toll-free reopening of the strategic Strait of Hormuz… pic.twitter.com/PwQBl4YHMA
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) June 14, 2026
‘ఇరాన్‌తో ఒప్పందం కుదిరింది. అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటి నుంచి హర్మూజ్ జలసంధిలో పైసా కట్టకుండా రవాణా జరుగుతుంది. అంతేకాదు తక్షణమే హర్మూజ్ నుంచి అమెరికా నౌకలను తరలిస్తాం. ప్రపంచ దేశాలు మీ నౌకలు సిద్ధం చేయండి. ఇక ముడి చమురు వరదలా రవాణా అవుతుంది’ అని ట్రంప్ ట్రుత్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య జూన్ 19న స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు ఉంటాయని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

