వాషింగ్టన్, మే 8: ఎగిరే పళ్లాలు నిజంగా ఉన్నాయా? అవి ఇతర గ్రహాలకు సంబంధించినవా? అప్పుడప్పుడు ఆకాశంలో కన్పించే గుర్తు తెలియని వస్తువులు ఏమిటి? ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా పలువురిలో ఆసక్తి, అనుమానాలు కలిగించే సందేహాలు. అమెరికా లాంటి అగ్రదేశం కూడా ఇలాంటి విషయాల పట్ల గోప్యంగానే వ్యవహరించింది. అయితే ఇలాంటి వాటి గురించి ప్రపంచ పౌరులకు వెల్లడించాలని, వారి సందేహాలను తీర్చాలని తొలిసారిగా నిర్ణయించింది ట్రంప్ ప్రభుత్వం.
ప్రజలు గుర్తించ లేని అసాధారణ ఘటనలు (యూఏపీ)కు సంబంధించిన రహస్య ప్రభుత్వ పత్రాల తొలిభాగాన్ని విడుదల చేసింది. వీటిని war.gov/ufo వెబ్సైట్లో చూడవచ్చు. ఈ ఫైళ్లను పొందడానికి ఎలాంటి భద్రతా అనుమతి అవసరం లేదు.