Donald Trump: క్యాపిటల్ హిల్ అటాక్.. మూడోసారి కోర్టుకు హాజరైన ట్రంప్
Donald Trump: క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన కేసుల్లో.. డోనాల్డ్ ట్రంప్ మూడోసారి కోర్టుకు హాజరయ్యారు. తాను నిర్దోషి అని ట్రంప్ కోర్టుకు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు తనను వేధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆగస్టు 28వ తేదీన ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టనున్నారు.
వాషింగ్టన్ డీసీ: 2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కోర్టుకు హాజరయ్యారు. ఆ కేసుల్లో తాను నిర్దోషిని అని ఆయన కోర్టు తెలిపారు. కోర్టు విచారణ సమయంలో తన పేరు, వయసు ఆయన చెప్పుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో ఆయన కోర్టుకు హాజరుకావడం ఇది మూడవసారి. కోర్టు వెనుక ఉన్న డోరు నుంచి ఆయన హాల్లోకి ఎంటర్ అయ్యారు. 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన కేసుల్లో ట్రంప్ విచారణ ఎదుర్కొంటున్నారు.
విచారణ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులు తనను ఆ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మొత్తం నాలుగు కేసుల్లో ట్రంప్‌పై విచారణ జరగుతోంది. మెజిస్ట్రేట్ జడ్జి మోక్సిలా ఉపాధ్యాయా ఈ కేసును విచారిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ కోర్టుహౌజ్లో ట్రంప్ కాసేపు గడిపారు. ఈ కేసుతో లింకున్న సాక్ష్యులతో మాట్లాడవద్దు అని ట్రంప్‌కు కోర్టు ఆదేశించింది. ఆగస్టు 28వ తేదీన ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

