గ్రీన్‌కార్డు పైనా నిబంధనల కొరడా.. ట్రంప్ సర్కారు ప్రణాళికలు
ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి ట్రంప్ సర్కారు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను కోరుకునే అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల అర్హతలను హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సవరించనున్నది.
- ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుకు నిబంధనలు కఠినతరం
వాషింగ్టన్: ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి ట్రంప్ సర్కారు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను కోరుకునే అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల అర్హతలను హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సవరించనున్నది. వచ్చే ఏడాది జనవరి నాటికి ఇవి సిద్ధం కావొచ్చు. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం విదేశీ నిపుణులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అర్హత, డాక్యుమెంటేషన్ ప్రమాణాలను ఇందులో ప్రభుత్వం నిర్వచించనున్నది. ఇది భవిష్యత్ దరఖాస్తుదారులు, యజమానుల నియామక వ్యూహాలను ప్రభావితం చేస్తుంది. అంటే సాధారణ నైపుణ్యాలు, సాధారణ అర్హతలు ఉన్న వారికి ఈ విభాగంలో గ్రీన్‌కార్డుల లభ్యత కఠినతరం కానుంది.
మరోవైపు హెచ్1బీ వీసా జారీపై కూడా ట్రంప్ సర్కారు మరింత కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. కొత్తగా జారీచేసే హెచ్1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు కట్టాలని ఇప్పటికే పేర్కొన్న ప్రభుత్వం.. తాజాగా వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేస్తున్నది.వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి సారించనున్నారు. హెచ్-1బీ వీసాల్లో సమగ్రతను తేవడానికి, అమెరికన్ కార్మికులకు సరైన వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడానికి ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

