Israel-Iran War | ఆస్పత్రి మా టార్గెట్ కాదు.. మా లక్ష్యం అవే : ఇరాన్
Israel-Iran War | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel-Iran War) తీవ్రరూపం దాల్చింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి.
Israel-Iran War | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం (Israel-Iran War) తీవ్రరూపం దాల్చింది. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను తీవ్రతరం చేశాయి. అదే సమయంలో ఇరాన్‌సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆస్పత్రి ధ్వంసమైంది. బీర్షెబాలోని వెయ్యి పడకల సోరోకా ఆస్పత్రి (Israeli hospital) ఆ దాడిలో దెబ్బతిన్నది. ఈ దాడిలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఈ దాడిపై ఇరాన్ స్పందించింది. తమ లక్ష్యం ఆస్పత్రి కాదని స్పష్టం చేసింది. ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకోలేదని తెలిపింది. సమీపంలోని ఇజ్రాయెల్ సైనిక, నిఘా స్థావరాలే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఆసుపత్రికి కేవలం పేలుడు తరంగాల ప్రభావం మాత్రమే తగిలిందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ పేర్కొంది. ‘దాడి ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ ఆర్మీ కమాండ్ అండ్ ఇంటెలిజెన్స్ బేస్, సోరోకా ఆస్పత్రి సమీపంలో ఉన్న గావ్-యామ్ టెక్నాలజీ పార్క్‌లోని ఆర్మీ ఇంటెలిజెన్స్ క్యాంప్’ అని ఐఆర్ఎన్ఏ తెలిపింది. తాము ప్రయోగించిన క్షిపణి లక్ష్యం ఆస్పత్రి కాదని వెల్లడించింది.
ఖమేనీ ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదు.. ఇజ్రాయెల్
ఇరాన్ జరిపిన ఈ దాడిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తానన్న ఖమేనీ వంటి నియంత ఇక ఉండకూడదన్నారు. ఐడీఎఫ్ దళాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ‘పిరికి ఇరాన్ నియంత సురక్షితమైన బంకర్లో దాక్కొని ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం. దీనికి ఖమేనీ పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖమేనీ ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకు, అయతొల్లా పాలనను అణగదొక్కడానికి ఇరాన్‌లోని వ్యూహాత్మక, ప్రభుత్వ లక్ష్యాలపై దాడులను పెంచాలని ప్రధాన మంత్రి, నేను ఐడీఎఫ్‌ను ఆదేశించాము’ అని రక్షణ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Also Read..
Israel-Iran War | ఖమేనీ ఇక ఉనికిలో ఉండటానికి వీల్లేదు : ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
Iranian Missile: ఇరాన్ మిస్సైల్ దాడిలో.. ఇజ్రాయిలీ ఆస్పత్రి ధ్వంసం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

