Xi Jinping | బీజింగ్ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు స్ట్రోక్ వచ్చిందా? అంటే అవుననే అంటున్నది ఆ దేశ సామాజిక మాధ్యమం. సీసీపీ మూడో ప్లీనరీ సమయంలో ఆయన స్ట్రోక్‌కు గురైనట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నది. మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు, మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది.
ఆయనకు స్ట్రోక్ వచ్చిన విషయాన్ని అధికారికంగా నిర్ధారించ లేదు. ఆయనకు స్ట్రోక్ వచ్చినట్టు జెన్నిఫర్ అనే రిపోర్టర్ వెల్లడించారు. 2021లో కూడా జిన్‌పింగ్ సెరిబ్రల్ ఎన్యూరిజంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందారు.