న్యూయార్క్, సెప్టెంబర్ 5: ప్రపంచంలోనే తొలి న్యూ క్లియర్ క్లాక్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కలిసి అభివృద్ధి చేసిన ఈ గడియారానికి సంబంధించిన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పని చేస్తుంది.
అధికారికంగా అంతర్జాతీయ సమయాన్ని చెప్పే ప్రస్తుత అటామిక్ గడియారాల కంటే ఈ న్యూక్లియర్ గడియారం మరింత కచ్చితత్వంతో సమయాన్ని చెప్తుంది. భవిష్యత్తులో అటామిక్ గడియారాలను న్యూక్లియర్ గడియారాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జీపీఎస్ వ్యవస్థలు మరింత కచ్చితత్వంతో పని చేయడానికి, ఇంటర్నెట్ వేగం పెరగడానికి, డిజిటల్ సమాచార వ్యవస్థల భద్రతకు, శాస్త్ర పరిశోధనలకు ఈ గడియారం కీలకంగా మారబోతున్నదని తెలిపారు.