Hezbollah : పశ్చిమాసియాలో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్నాయి. భీకర దాడులతో హెజ్బొల్లాకు చెందిన కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా చంపేస్తుండంతో ఉద్రికత్తలు మరింత పెరిగాయి. హసన్ నస్రల్లా మరణానంతరం హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్, తాత్కాలిక నాయకుడిగా నయీమ్ కస్సేమ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలిసారి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇక ఇజ్రాయెల్ భూతల దాడులను స్టార్ట్ చేయాలనుకుంటే అందుకు తాము కూడా రెడీగానే ఉన్నామని హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ కస్సేమ్ తెలిపారు. హెజ్బొల్లాలోని కీలక మిలటరీ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిందని, కానీ ఆ దాడులు మా సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయాయని అన్నారు. మా సంస్థ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైందని నయీమ్ కసేమ్ అన్నారు.
అయితే కొన్ని రోజులుగా హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. బీరుట్‌పై జరిగిన దాడుల్లో హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించారు. ఆ తర్వాత మరో కీలక నేతను కూడా ఐడీఎఫ్ దళాలు చంపేశాయి. దాడులు ప్రారంభమైన 10 రోజుల వ్యవధిలోనే నస్రల్లాతో సహా ఆరుగురు కీలక కమాండర్లను ఇజ్రాయెల్ హతమర్చింది. లెబనాన్‌లో 1000కి పైగా మంది ప్రాణాలు కోల్పోగా వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.