చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

బీజింగ్ : అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. జెంగ్జౌ నగరంలో మూడు రోజుల్లో ఒక ఏడాదికి సరిపడా వర్షాన్ని చవిచూసిన పరిస్థితి నెలకొన్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విచారం వ్యక్తం చేశారు.
కుండపోతగా కురుస్తున్న వర్షాలు, భారీ వరదలు చైనా సెంట్రల్ ప్రొవెన్స్లో అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం వరదలు హెనాన్ ప్రావిన్స్‌ను తాకాయి. నదుల ఒడ్డు, ఆనకట్టలు, ప్రజా రవాణా వ్యవస్థను నాశనం చేశాయి. భారీ వరదల కారణంగా వేలాది మంది ప్రజలను అధికారులు బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రొవిన్షియల్ క్యాపిటల్ అయిన జెంగ్జౌలో సబ్వేలో చిక్కుకుని కనీసం 12 మంది మరణించారు. ఇక్కడ ఒక సంవత్సరంలో నమోదైన వర్షాపాతం – 640 మి.మీ కేవలం మూడు రోజుల్లోనే కురిసింది. మంగళవారం రాత్రి 7 నుంచి 552 మి.మీ కంటే ఎక్కువ వర్షాపాతం నమోదైనట్లు నగర వాతావరణ బ్యూరో తెలిపింది.
దాదాపు 2,00,000 మందిని తరలించినట్లు స్థానిక మీడియా జిన్హువా బుధవారం తెలిపింది. జెంగ్జౌ రిజర్వాయర్ వద్ద నీటి నిల్వ ఆనకట్టకు ప్రమాదంగా మారిందని, స్థానిక ప్రభుత్వం ప్రజలను తరలింపునకు ఆదేశించినట్లు జెంగ్జౌ వరద నియంత్రణ ప్రధాన కార్యాలయం తెలిపింది. చాలా ప్రాంతాల్లో ప్రజారవాణా నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాలకు విమానాలను రద్దు చేశారు. దాదాపు 70 లక్షల జనాభా కలిగిన నగరమైన లుయోయాంగ్లోని యిహేతాన్ ఆనకట్టలో నీరు పెద్ద మొత్తంలో చేరడంతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. వరద మళ్లింపుతోపాటు ఇతర అత్యవసర సహాయం కోసం సైనికులు బయల్దేరి వెళ్లారు.
వర్షాకాలంలో చైనాలో వరదలు సర్వసాధారణం. అయితే చైనాలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, ప్రపంచ వాతావరణ సంక్షోభం కారణంగా దశాబ్దాలుగా వాటి ప్రభావం మరింత దిగజారేలా చేస్తున్నదని వాతావరణ నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవిలో చైనాలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ సంఘటనలు కూడా సంభవించాయని వారంటున్నారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని లక్షలాది మంది నివాసితులు ఈ నెలలో వరదలు, కొండచరియలు విరిగిపడి నష్టపోయినట్లు నివేదికలు చెప్తున్నాయి.
7月20日晚,郑州暴雨地铁5号线一车厢多人被困,水位淹过肩膀。根据郑州地铁晚上发布的消息,受持续暴雨影响,郑州地铁全线网车站已暂停运营服务,消防人员正在救援。 pic.twitter.com/wCiz7TGhki
— The Paper 澎湃新闻 (@thepapercn) July 20, 2021
ఇవి కూడా చదవండి..
చైనాను ముంచెత్తిన వరదలు.. ఫొటోలు
రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
ఆకాశంలో బర్త్‌డే, పెండ్లి రోజు ఫంక్షన్లు..! ఎక్కడంటే?
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

