130 హత్యలు చేసిన నరహంతకుడు!
వాషింగ్టన్: 130 హత్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నర హంతకుడు రోడ్నీ జేవ్ అల్కల (77) మరణించినట్టు కాలిఫోర్నియా పోలీసులు సోమవారం తెలిపారు. ఆరోగ్య కారణాలతో ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు. 1977-1979 మధ్య కాలంలో కాలిఫోర్నియాలో దాదాపు ఐదుగురిని హత్య చేసిన నేరాలకు గాను అల్కలాకు 2010లో కోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే, అల్కల అమెరికావ్యాప్తంగా దాదాపు 130 మందిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అల్కల తాను హత్య చేసిన మహిళల చెవిపోగులను ట్రోఫీలుగా తీసుకునేవాడని పేర్కొంటారు. తాను ఎలాంటి నేరాలు చేయలేదని ‘డేటింగ్ గేమ్’ అనే షోలో అల్కలా పేర్కొనడంతో అతను ‘డేటింగ్ గేవ్ు కిల్లర్’గా ప్రచారంలోకి వచ్చాడు.