శనివారం 04 జూలై 2020
International - May 27, 2020 , 18:03:42

నేపాల్‌లో క‌రోనా విజృంభ‌ణ‌

నేపాల్‌లో క‌రోనా విజృంభ‌ణ‌

న్యూఢిల్లీ: నేపాల్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించింది. గ‌త రెండు నెల‌లుగా రోజుకు 10, 20 కొత్త కేసులు పెరుగుతూ వ‌చ్చిన నేపాల్‌లో బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 114 కేసులు న‌మోద‌య్యాయి. ఆ దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కాలు మోపిన‌ప్ప‌టి నుంచి ఒక్క‌రోజే ఇంత పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. కాగా, బుధ‌వారం న‌మోదైన కొత్త కేసుల‌తో క‌లిపి నేపాల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 886కు చేరింది. నేపాల్ ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.   


logo