బీజింగ్ : చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. దక్షిణ చైనాలోని సాంకేతిక కేంద్రమైన షెన్జెన్లో జిన్‌పింగ్ ప్రభుత్వం సోమవారం కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించినట్లు తెలుస్తున్నది. దీంతో లక్షల మంది జనం ఇండ్లకు పరిమితమయ్యారు. జిల్లాలో ఒకే రోజు 66 మందికి వైరస్ సోకడంతో స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌లో శుక్రవారం లాక్డౌన్ విధించారు.
90లక్షల మంది ప్రజలకు అత్యవసర హెచ్చరికలతో ఇండ్లలోనే ఉండాలని ఆదేశించారు. మరోవైపు దాదాపు 5లక్షల జనాభా ఉన్న షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని యుచెంగ్‌లో కూడా లాక్డౌన్ ఆంక్షలు జారీ చేశారు. ప్రస్తుతం మూడు నగరాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయి. హువావే, టెన్సెంట్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు షెన్జెన్లో ఉండగా.. హాంకాంగ్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. హాంకాంగ్‌లో పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది.
ఇప్పటి వరకు అధికారులు 27వేలకుపైగా కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు నిర్ధారించారు. హాంకాంగ్‌లో కొవిడ్-19 కారణంగా మరో 87 మంది మరణించారు. చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు చైనాలో శనివారం నమోదయ్యాయి. కొవిడ్ కేసుల నేపథ్యంలో పలు నగరాలతో పాటు షాంఘైలో పాఠశాలలు, పార్క్‌లను మూసివేశారు. బీజింగ్‌లో నివాస ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. కొత్త కొవిడ్ కేసులను బీజింగ్‌లోని అధికారులు బయటకు రావొద్దని కోరింది. అవసరమైతే తప్ప ప్రజలు కూడా నగరాన్ని విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.