వాషింగ్టన్, జూన్ 24: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఎర్ల్ లెరాయ్ బడ్డీ కార్నర్ నామినేట్ చేశారు. ట్రంప్ యంత్రాంగం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ నామినేషన్ దాఖలైంది. కాల్పుల విరమణ ఒప్పందం ఒక దౌత్యపరమైన పురోగతిగా కార్నర్ పేర్కొన్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చలను సులభతరం చేయడంతో, రెండు దేశాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని సాధించి రెండు వారాలుగా నెలకొన్న తీవ్ర సంక్షోభానికి తెరదించడంలో ట్రంప్ కీలకపాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు.