Living Computer | లండన్, జూన్ 9: మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీనా? ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా.. కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్ కంప్యూటర్’ను తయారుచేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. ఫైనల్‌స్పార్క్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన పరిశోధకులు ‘బ్రెయినోవేర్’ అనే కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను కలిపి దీన్ని సృష్టించారు.
అందుకే, రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు పెట్టారు. ముందుగా శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూలకణాలను తీసుకొని ల్యాబ్‌లో వాటితో న్యూరాన్ల తరహా లక్షణాలను కలిగి ఉండే ఆర్గనాయిడ్లను తయారుచేసి ఉపయోగించారు. ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్స్‌ను పంపించడం, అందుకోవడం చేయగలదు. అయితే, మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు 80 ఏండ్లు జీవించి ఉంటా యి. కానీ, వీటిలోని న్యూరాన్లు మాత్రం 100 రోజులే జీవించి మృతి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేయనున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం వినియోగిస్తున్న డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే దాదాపు 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్తును ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత. ఏఐ డాటా సెంటర్లు ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్న నేపథ్యం లో, తమ కొత్త సాంకేతికతతో విద్యు త్తు వినియోగాన్ని తగ్గించేలా ప్రయోగాలు చేపడతామని ఫైనల్‌స్పార్క్ సహ సీఈవో డాక్టర్ ఫ్రెడ్ జార్డన్ తెలిపారు.