న్యూయార్క్: చాట్‌జీపీటీ నిపుణులకు మంచి డిమాండ్ ఉన్నదని ఓ అధ్యయనంలో తేలింది. చాట్‌జీపీటీ నిపుణులకు 91% కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడైంది. ఏఐ సమయాన్ని ఆదా చేయడంతోపాటు ఉత్పాదకత, కంపెనీ సామర్థ్యాన్ని పెంచుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. కొన్ని కంపెనీలు చాట్‌జీపీటీ నిపుణులకు ఏడాదికి రూ.1.5 కోట్ల వేతనాన్ని ఆఫర్ చేస్తున్నట్టు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. ఏఐ టూల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు రూ.1.25 కోట్ల వేతనం ఉంటుందని యూఎస్‌కి చెందిన ఓ హెచ్ఆర్ కంపెనీ ప్రకటన ఇచ్చిందని తెలిపింది.